దేవాలయంలో పూజలు.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఐదుగురి అరెస్ట్..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో మతపరమైన సమావేశాలు కానీ.. పూజలు కానీ చేయరాదంటూ కేంద్రం గైడ్‌లైన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండోర్‌లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ దేవాలయంలో పూజలు చేస్తున్న ఐదుగురు భక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో […]

దేవాలయంలో పూజలు.. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఐదుగురి అరెస్ట్..

Edited By:

Updated on: May 07, 2020 | 5:52 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో మతపరమైన సమావేశాలు కానీ.. పూజలు కానీ చేయరాదంటూ కేంద్రం గైడ్‌లైన్స్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండోర్‌లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ దేవాలయంలో పూజలు చేస్తున్న ఐదుగురు భక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. నగరంలోని నర్సింగ్‌ దేవాలయంలో ఓ ఐదుగురు భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.

కాగా.. ఇండోర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. బుధవారం నాడు ఒక్కరోజే ఇక్కడ 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండోర్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ క్రమంలోనే పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.