ముంబై.. 500 మంది తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ !

దక్షిణ ముంబై కొలబాలోని తాజ్ మహల్ ప్యాలస్, తాజ్ మహల్ టవర్స్ లో పని చేసే దాదాపు 500 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు షాకింగ్ న్యూస్ వచ్చింది.

ముంబై.. 500 మంది తాజ్ హోటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ !

Edited By:

Updated on: Apr 12, 2020 | 5:55 PM

దక్షిణ ముంబై కొలబాలోని తాజ్ మహల్ ప్యాలస్, తాజ్ మహల్ టవర్స్ లో పని చేసే దాదాపు 500 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ లక్షణాలు సోకినట్టు షాకింగ్ న్యూస్ వచ్చింది. వీరిలో చాలామందికి అసలు ఎలాంటి అస్వస్ధతా కలగలేదని ఈ గ్రూప్ హోటల్స్ ని నిర్వహిస్తున్న ఇండియన్ హోటల్స్ కంపెనీ వెల్లడించింది. అయినప్పటికీ పాజిటివ్ గా తేలినవారిని ఆసుపత్రికి, మరికొందరిని క్వారంటైన్ కి తరలించినట్టు ఈ సంస్థ తెలిపింది. ప్రస్తుతం తాజ్ మహల్ ప్యాలస్ లో గానీ టవర్స్ లో గానీ గెస్టులు ఎవరూ లేరని, కేవలం హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, మెయిన్ టెనెన్స్ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు మాత్రమే పరిమిత సంఖ్యలో ఉన్నారని ఈ కంపెనీ పేర్కొంది. ఇలా ఉండగా ముంబై ధారవి మురికివాడలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 43 కి పెరిగింది. సుమారు 7 లక్షల జనాభా ఉన్న ఈ స్లమ్ లో ప్రతి వ్యక్తినీ స్క్రీనింగ్ చేసే పనిలో పడ్డారు అధికారులు.. మహారాష్టలో తాజాగా 1900 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us