ఏపీ..కరోనా రోగి మృతదేహం జేసీబీ యంత్రంలో తరలింపు.. సర్కార్ సీరియస్.. ఇద్దరి సస్పెన్షన్

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 10:49 AM

కరోనా వైరస్ తో మృతి చేసిన ఓ రోగి డెడ్ బాడీని ఎలాంటి ప్రభుత్వ వాహనమో, అంబులెన్స్ లోనో కాకుండా జేసీబీ (ఎర్త్ మూవర్) లో తరలించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన..

ఏపీ..కరోనా రోగి మృతదేహం జేసీబీ యంత్రంలో తరలింపు.. సర్కార్ సీరియస్.. ఇద్దరి సస్పెన్షన్
Follow us on

కరోనా వైరస్ తో మృతి చేసిన ఓ రోగి డెడ్ బాడీని ఎలాంటి ప్రభుత్వ వాహనమో, అంబులెన్స్ లోనో కాకుండా జేసీబీ (ఎర్త్ మూవర్) లో తరలించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మున్సిపాలిటీ మాజీ ఉద్యోగి ఒకరు కరోనా వైరస్ తో మరణించారు. 72 ఏళ్ళ అతని డెడ్ బాడీని ప్రొటెక్టివ్ సూట్లు ధరించిన సిబ్బంది.. ఓ జేసీబీ యంత్రంలో స్మశాన వాటికకు తరలించిన వీడియో సంచలనం రేపింది. గ్రామ వాలంటీర్ అయిన అతని మనుమరాలు..మున్సిపల్ అధికారులకు తన తాతయ్య మరణించిన విషయాన్ని తెలియజేయగా.. వారు వఛ్చి ఈ నిర్వాకానికి పూనుకొన్నారు. ఈ ఘటనపై ఆగ్రహించిన ఏపీ ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ ని, శానిటరీ ఇన్స్ పెక్టర్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలాస వంటి చిన్న టౌన్లలో అంబులెన్స్ కొరత తీవ్రంగా ఉంది. సమయానికి వాహనాలేవీ అందుబాటులో లేకపోవడంతో అత్యవసరంగా మున్సిపల్ సిబ్బంది చేసేది లేక రోడ్డు నిర్మాణ పనుల్లో వినియోగించే జేసీబీ వాహనాన్ని వినియోగించినట్టు తెలుస్తోంది. అందులోనూ కరోనా మహమ్మారి భయం చిన్న పట్టణాల్లో సైతం ప్రజలకు తీవ్రంగా ఉంది.