కరోనా వైరస్ కేసులతో తల్లడిల్లిపోయిన ఢిల్లీ నగరం మెల్లగా కోలుకుంటోంది. కోవిడ్-19 పాజిటివిటీ రేటు 10.58 శాతానికి తగ్గినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సుమారు వారం, పది రోజుల క్రితం ఇది దాదాపు 37 శాతం ఉంది. సగటున కరోనా కేసులు కూడా గతవారంతో పోలిస్తే వెయ్యి వరకు తగ్గాయని డిప్యూటీ సీఎం మనీష్ శిశోడియా తెలిపారు. ఇది స్వాగతించదగిన పరిణామమన్నారు. నగరంలో రీకవరీ రేటు 70 శాతం పెరిగిందని, అయితే దేశంలో ఈ రేటు 60.81 శాతం ఉన్న విషయం గమనార్హమన్నారు. శనివారం తాజాగా 2,505 కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. కాగా దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,200 కి పెరిగింది. 24 గంటల్లో 50 మరణాలు సంభవించాయి. దీంతో మృతుల సంఖ్య 3,004 కి చేరింది. 97,200 మంది రోగుల్లో 68,256 మంది కోలుకున్నట్టు మనీష్ శిశోడియా ట్వీట్ చేశారు. నగరంలో కరోనా తగ్గుముఖం పట్టడానికి రెండు కోట్ల మంది ప్రజల కృషే కారణమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరోనాపై విజయం సాధించాలంటే మరింత కఠినంగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. అటు-ఇప్పటివరకు ఢిల్లీలో 5.9 లక్షల కోవిద్-19 టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో రాపిడ్ యాంటిజెన్ మెథడాలజీని వినియోగించారు. గత జూన్ 18 నుంచే రాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రారంభించినట్టు ప్రభుత్వం పేర్కొంది.
Less and less people in Delhi are now requiring hospitalisation, more and more people are getting cured at home. Whereas there were around 2300 new patients daily last week, no of patients in hospital has gone down from 6200 to 5300. Today, 9900 corona beds are free
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 5, 2020