కరోనా అప్డేట్స్… ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా… కొత్తగా 3188 కేసులు.. 57 మరణాలు నమోదు…

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3,188కొత్త కేసులు నమోదు అయ్యాయి.

కరోనా అప్డేట్స్... ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా... కొత్తగా 3188 కేసులు.. 57 మరణాలు నమోదు...

Updated on: Dec 08, 2020 | 11:49 PM

Delhi corona Cases: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 3,188కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,97,112కు చేరింది. ఇక 24 గంటల్లో 57 మంది మరణించారు. అలాగే 3,307 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. కోలుకున్న వారి సంఖ్య 5,65,039కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 22,310 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఢిల్లీలో మూడో వేవ్ ప్రారంభమైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. త్వరలోనే కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా దేశంలో చలికాలం ప్రారంభం అవ్వడంతో పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్‌ కొనసాగుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us