గుడ్‌న్యూస్‌.. దేశ రాజధానిలో తగ్గుముఖం.. పెరుగుతున్న రికవరీలు..

| Edited By:

Jul 21, 2020 | 7:28 PM

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభన తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులను చూస్తే.. ఈ విషయం స్పష్టం అవుతోంది. నమోదవుతున్న కేసులతో పాటుగా.. రికవరీలు కూడా పెద్ద..

గుడ్‌న్యూస్‌.. దేశ రాజధానిలో తగ్గుముఖం.. పెరుగుతున్న రికవరీలు..
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభన తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులుగా నమోదవుతున్న కేసులను చూస్తే.. ఈ విషయం స్పష్టం అవుతోంది. నమోదవుతున్న కేసులతో పాటుగా.. రికవరీలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి. తాజాగా మంగళవారం నాడు కొత్తగా మరో 1,349 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,096కి చేరింది. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1200 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 1,06,118 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కాగా, మంగళశారం నాడు ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు ఇరవై వేలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 5651 ఆర్టీపీసీఆర్ ప్రక్రియలో చేయగా.. 15,201 ర్యాపిడ్‌ యాంటిజెన్ పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా 8,51,311 కరోనా పరీక్షలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.