కరోనా కాటుకు పోలీస్ అధికారి మృతి..

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ దాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, వైద్యులు, డాక్టర్లు అంతా మరణిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనా బారినపడి..

కరోనా కాటుకు పోలీస్ అధికారి మృతి..

Edited By:

Updated on: Jul 01, 2020 | 9:36 AM

దేశ రాజధానిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ దాటికి సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, వైద్యులు, డాక్టర్లు అంతా మరణిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో కరోనా బారినపడి ఓ ఇన్‌స్పెక్టర్ మరణించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ సెల్‌కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్‌ గత 14రోజులుగా కరోనా బారినపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఇతడికి ఇప్పటి వరకు రెండు సార్లు ప్లాస్మా కూడా ఇచ్చామని వైద్యాధికారులు తెలిపారు. దీని కోసం వైద్యులు అధికారుల నుంచి కూడా ప్రత్యేక అనుమతులను తీసుకున్నారు. వైద్యులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సంజీవ్ కుమార్ ప్రాణాలు దక్కలేదు. కాగా, గతేడాది సంజీవ్ ఈ ఏడాది జనవరిలో ఉత్తమ పోలీస్ అవార్డ్ పతకాన్ని కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 87వేల మార్క్‌ దాటింది.