మరో ఏఎస్ఐని కాటేసిన కరోనా..!

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ లాక్‌డౌన్‌ సక్రమంగా ప్రజలు పాటించేలా చూసుకునేందుకు రక్షణగా నిలబడేది పోలీసులు. అయితే ఇప్పుడు ఆ పోలీసులను కూడా ఈ కరోనా మహమ్మారి కాటేస్తోంది. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో మరో ఏఎస్‌ఐకు కరోనా మహమ్మారి కాటేసింది. 56 ఏళ్ల ఏఎస్‌ఐ ఏప్రిల్ 8వ తేదీ నుంచి.. ఢిల్లీ నగరంలోనే డ్యూటీ చేస్తున్నారు. అయితే డ్యూటీలో ఉండగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు […]

మరో ఏఎస్ఐని కాటేసిన కరోనా..!

Updated on: Apr 13, 2020 | 9:30 PM

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ లాక్‌డౌన్‌ సక్రమంగా ప్రజలు పాటించేలా చూసుకునేందుకు రక్షణగా నిలబడేది పోలీసులు. అయితే ఇప్పుడు ఆ పోలీసులను కూడా ఈ కరోనా మహమ్మారి కాటేస్తోంది. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో మరో ఏఎస్‌ఐకు కరోనా మహమ్మారి కాటేసింది. 56 ఏళ్ల ఏఎస్‌ఐ ఏప్రిల్ 8వ తేదీ నుంచి.. ఢిల్లీ నగరంలోనే డ్యూటీ చేస్తున్నారు. అయితే డ్యూటీలో ఉండగా.. కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి.. వెంటనే కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు.. వెంటనే ఆయన కుటుంబాన్ని.. అతనితో కలిసి డ్యూటీ చేసిన పోలీసులకు కూడా కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటి వరకు ఢిల్లీలో ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లయింది. గతంలో ఓ ట్రాఫిక్ ఏఎస్‌ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు ఢిల్లీ నగరంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us