కరోనా వేళ….జర్నలిస్టులకు మూడు రాష్ట్రాల బాసట

| Edited By: Pardhasaradhi Peri

Apr 21, 2020 | 8:20 PM

రోనా కాలంలో జర్నలిస్టులను ఆదుకునేందుకు ఢిల్లీ, యూపీ, కర్ణాటక ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఈ తరుణంలో వీరిని అత్యవసర సిబ్బందిగా వర్గీకరించామని, ఆసక్తి ఉన్న జర్నలిస్టులు

కరోనా వేళ....జర్నలిస్టులకు మూడు రాష్ట్రాల బాసట
Follow us on

కరోనా కాలంలో జర్నలిస్టులను ఆదుకునేందుకు ఢిల్లీ, యూపీ, కర్ణాటక ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఈ తరుణంలో వీరిని అత్యవసర సిబ్బందిగా వర్గీకరించామని, ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఎవరైనా రేపటి నుంచి ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో పరీక్షలు చేయించుకోవచ్ఛునని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇలాగే కర్ణాటక, యూపీ ప్రభుత్వాలు కూడా పాత్రికేయుల టెస్టులకోసం ప్రత్యేక  శిబిరాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నాయి. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో ఈ రాష్ట్రాలు ఈ చొరవను తీసుకున్నాయి. చెన్నైలో ఓ టీవీ ఛానల్ లో పని చేసే 25 మంది జర్నలిస్టులకు కూడా ఈ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి.