దాటి మహారాజ్ అరెస్ట్.. రీజన్ ఇదే..

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించార్న ఆరోపణలపై దాటి మహారాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు తాను దేవుడిగా చెప్పుకునే ఇతను.. గత వారం రాత్రి సమయంలో దేవాలయంలో పూజలు నిర్వహించారని.. అక్కడ లాక్‌డౌన్ నిబంధనలను కూడా పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై ఐపీసీ సెక్షన్ 188 అండ్ 34,54బీతో పాటు.. డీడీఎంఏ కింద కూడా కేసులు బుక్ చేశారు. ఈ విషయాన్ని […]

దాటి మహారాజ్ అరెస్ట్.. రీజన్ ఇదే..

Updated on: May 28, 2020 | 12:04 PM

లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించార్న ఆరోపణలపై దాటి మహారాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు తాను దేవుడిగా చెప్పుకునే ఇతను.. గత వారం రాత్రి సమయంలో దేవాలయంలో పూజలు నిర్వహించారని.. అక్కడ లాక్‌డౌన్ నిబంధనలను కూడా పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనపై ఐపీసీ సెక్షన్ 188 అండ్ 34,54బీతో పాటు.. డీడీఎంఏ కింద కూడా కేసులు బుక్ చేశారు. ఈ విషయాన్ని సౌత్ ఢిల్లీ డీసీపీ అతుల్ ఠాకూర్‌ వెల్లడించారు. కేసులు నమోదు చేసిన అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే బెయిల్‌ మంజూరు అయ్యింది. కాగా, గతంలో దాటి మహారాజ్‌పై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us