కరోనా టెస్టులు చేస్తుండటంతో.. అక్కడి ప్రజల్లో టెన్షన్

| Edited By:

May 17, 2020 | 3:02 PM

కరోనా మహమ్మారికి కేరాఫ్ అయిన చైనాలోని వూహాన్ నగరంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. గత కొద్ది రోజులుగా అక్కడ మళ్లీ కరోనా కేసులు నమోదువుతుండటంతో.. చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రెండో సారి విజృంభిస్తోన్న తరుణంలో వ్యక్తులు కరోనా లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో.. అధికారులు అక్కడి వారందరికీ మళ్లీ కరోనా పరీక్షలు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. వూహాన్ పరిసర ప్రాంతంలో కరోనా లక్షణాలు కనిపించకుండా.. కరోనా క్యారియర్స్ కూడా ఉన్నారని […]

కరోనా టెస్టులు చేస్తుండటంతో.. అక్కడి ప్రజల్లో టెన్షన్
Follow us on

కరోనా మహమ్మారికి కేరాఫ్ అయిన చైనాలోని వూహాన్ నగరంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. గత కొద్ది రోజులుగా అక్కడ మళ్లీ కరోనా కేసులు నమోదువుతుండటంతో.. చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రెండో సారి విజృంభిస్తోన్న తరుణంలో వ్యక్తులు కరోనా లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో.. అధికారులు అక్కడి వారందరికీ మళ్లీ కరోనా పరీక్షలు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. వూహాన్ పరిసర ప్రాంతంలో కరోనా లక్షణాలు కనిపించకుండా.. కరోనా క్యారియర్స్ కూడా ఉన్నారని వారిని గుర్తించేందుకు భారీ స్థాయిలో కరోనా టెస్టులు చేపడుతున్నారు. ఇందుకోసం నగరంలోని బహిరంగ ప్రదేశాలు, క్లినిక్‌లతో పాటు ఇతర ప్రదేశాల్లో కూడా కరోనా టెస్టులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానికులు ఎక్కడికక్కడే పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో తమకు కూడా ఎక్కడ కరోనా సోకుతుందోనన్న ఆందోళన మొదలైంది. దాదాపు కోటికి పైగా ఉన్న వూహాన్ నగరంలో భారీగా టెస్టులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రజలు గుంపులుగుంపులుగా ఉంటున్నారు. అయితే ఇలా చేయడం ద్వారా మళ్లీ కరోనా ఎక్కడ ఉదృతం అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.

కాగా, ఇప్పటి వరకు చైనాలో 82,941 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. అందులో 4633 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గత వారం రోజులుగా మళ్లీ అక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి.