పాక్ క్రికెట్ టీమ్ లో కరోనా టెర్రర్..10కి చేరిన పాజిటివ్ కేసులు

పాకిస్థాన్ క్రికెట్ టీం లో కరోనా టెన్షన్ మొదలైంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా వైరస్ సోకినట్లు సోమవారం (జూన్22) తేలింది. కాగా, తాజాగా టీం లోని మరో ఏడుగురు...

పాక్ క్రికెట్ టీమ్ లో కరోనా టెర్రర్..10కి చేరిన పాజిటివ్ కేసులు

Updated on: Jun 23, 2020 | 7:46 PM

పాకిస్థాన్ క్రికెట్ టీం లో కరోనా టెన్షన్ మొదలైంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు పాకిస్తాన్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులోని ముగ్గురు క్రికెటర్లకు కరోనా వైరస్ సోకినట్లు సోమవారం (జూన్22) తేలింది. కాగా, తాజాగా టీం లోని మరో ఏడుగురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మంగళవారం అధికారికంగా దృవీకరించింది. ఫఖర్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి, మహ్మద్ హఫీజ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్, వహబ్ రియాజ్ లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు.

జట్టులో కీలక ఆటగాళ్లయిన హైదర్ అలీ, హరిస్ రౌఫ్, షాదాబ్ ఖాన్‌ కరోనా భారిన పడ్డట్టు సోమవారం తెలిపింది. ఇంగ్లండ్ తో పర్యటనకు ముందు జట్టు సభ్యులకు కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించామని అందులో భాగంగా పరీక్షలు జరిపించామని అధికారులు తెలిపారు. రావల్పిండిలో ఆదివారం నాడు జట్టుసభ్యుల నమూనాలను సేకరించి టెస్టుల కోసం పంపించారు. కాగా జట్టులో ఏ ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు లేకపోవటంతో తాము ఆరోగ్యంగానే ఉన్నామని భావించారు. టీం లో మొత్తం పదిమందికి కరోనా పాజిటివ్ రావటంతో పాక్ క్రికెట్ టీం ఇంగ్లాండ్ పర్యటన సందిగ్ధంలో పడింది.