కరోనా.. దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు.. ఇన్ఫెక్షన్ల జోరు

| Edited By: Pardhasaradhi Peri

Apr 19, 2020 | 7:43 PM

ఇండియాలో కరోనా నుంచి కోలుకున్నవారి శాతం నాలుగు రోజుల్లో 14. 19 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫెక్షన్లు రెట్టింపు అయ్యాయని వెల్లడించింది. ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 24 గంటల్లో 1334 ఫ్రెష్ కేసులు నమోదయ్యాయని, 27 మంది రోగులు మృతి చెందారని చెప్పారు. మొత్తం కేసులు 15, 712 కాగా.. మృతుల సంఖ్య 507 కి పెరిగిందన్నారు. 2, 231 మంది […]

కరోనా.. దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు.. ఇన్ఫెక్షన్ల జోరు
Follow us on

ఇండియాలో కరోనా నుంచి కోలుకున్నవారి శాతం నాలుగు రోజుల్లో 14. 19 శాతం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫెక్షన్లు రెట్టింపు అయ్యాయని వెల్లడించింది. ఈ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గత 24 గంటల్లో 1334 ఫ్రెష్ కేసులు నమోదయ్యాయని, 27 మంది రోగులు మృతి చెందారని చెప్పారు. మొత్తం కేసులు 15, 712 కాగా.. మృతుల సంఖ్య 507 కి పెరిగిందన్నారు. 2, 231 మంది రోగులు కోలుకున్నారని, ఇది 14. 19 శాతమని వివరించారు. కంటెయిన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ సడలింపులు ఉండవని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు.