తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని పేర్కొన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో కరోనా విజృంభణ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందన్నారు. కాగా ప్రస్తుతం జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మరణాలు 0.7 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పారు.
అలాగే తెలంగాణలో రికార్డు స్థాయిలో 52 వేలకు పైగానే టెస్టులు చేస్తున్నట్టు తెలిపారు. మొత్తం పరీక్షల్లో 50 శాతం పరీక్షలు ఆగష్టు నెలలోనే జరిగాయని శ్రీనివాస్ వెల్లడించారు. మొత్తం ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా టెస్టులు చేశామన్నారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో 17 వేళకు పైగా ఉన్నారు. బెడ్స్, మెడిసిన్స్ అన్ని కోవిడ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్ర, కర్ణాటక నుండి ట్రీట్మెంట్ కోసం తెలంగాణకు వస్తున్నట్టు గుర్తించాం.
డోర్ స్టెప్ సర్వేలేన్స్ టెస్టులు చేస్తున్నాం. సీజనల్ ఫ్లూస్ బాగా వస్తున్నాయి. కోవిడ్ లక్షణాలు, సీజనల్ ఫ్లూస్ లక్షణాలు ఒకటే ఉంటాయి. కాబట్టి ప్రజలెవరూ భయపడొద్దని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ సూచించారు.
Read More:
కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య
వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం