Good News: తక్కువ ధరకే కరోనా రక్షణ కవచాలు.. సరికొత్త ఫేస్ ఫీల్డ్‌ రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ బృందం

|

Jul 28, 2021 | 8:58 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఇంతవరకు మందు అందుబాటులో లేదు. అయితే, వైరస్ సోకకుండా అడ్డుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు

Good News: తక్కువ ధరకే కరోనా రక్షణ కవచాలు.. సరికొత్త ఫేస్ ఫీల్డ్‌ రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ బృందం
Low Cost New Type Of Face Shield
Follow us on

Low Cost Face Shield: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఇంతవరకు మందు అందుబాటులో లేదు. అయితే, వైరస్ సోకకుండా అడ్డుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇదేక్రమంతో కోవిడ్ మహమ్మారితో పోరాడేందుకు సరికొత్త ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన టీకాలతో విదేశీ సంస్థలు సైతం మన దేశంలోని వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు వైరస్ దరిచేరకుండా మాస్కులు, ఫేస్ షీల్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇవీ సామాన్యులకు చేరాలంటే కొంత ఖరీదు కావడంతో కొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీ విద్యార్థులు చవకైన ఫేస్ షీల్డులను రూపొందించారు.

కరోనా కట్టడిలో ఐఐటీ హైదరాబాద్ బృంద సభ్యులు మరో ముందడుగు వేశారు. తక్కువ ధరకే మంచి రక్షణనిచ్చే సరికొత్త ఫేస్ ఫీల్డ్‌ను రూపొందించారు. ఐఐటీ హైదరాబాద్‌లోని డిజైన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన హెచ్ఓడీ ఆధ్వర్యంలో లేజర్ కటింగ్ ద్వారా తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో సరికొత్త ఫేస్‌ ఫీల్డ్‌ను ఆవిష్కరించారు. ఫేస్ షీల్డ్‌ను పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా డిజైన్ చేశారు. ఫీల్డ్‌ను కూడా అవసరం ఉన్నప్పుడు మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించారు. 0.5 మిల్లీమీటర్ల మందం కలిగిన పాలిపరోపిలిన్‌ షీట్‌ను దీని తయారీలో వాడినట్లు విద్యార్థుల బృందం తెలిపింది. దీని కేవలం ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటుందని తెలిపారు. ఈ ఫేస్ షీల్డ్‌ను ఇప్పటికే ఐఐటీలోని విద్యార్థులతోపాటు సిబ్బందికి అందజేశారు. సరికొత్త ఫేస్‌ షీల్డ్‌ తయారీ చేసిన బృందాన్ని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అభినందించారు. వీటిని త్వరంలో అందరికి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

Read Also…  CM KCR: తెలుగు సాహిత్యాన్ని సినారె పరిపుష్టం.. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు..!

Viral Video: ఫుల్ ట్రాఫిక్‏లో రోడ్డుపై అడ్డంగా బైక్ పెట్టిన వ్యక్తి.. అయినా అతడు చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు.. ఎందుకంటే..