మాస్క్‌లతో జాగ్రత్త.. వారు వాడకపోవడమే మంచిదంటోన్న శాస్త్రవేత్తలు..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో మనిషి జీవితం లాక్‌డౌన్ ముందు, దాని తర్వాత అన్నట్లుగా తయారైంది.

మాస్క్‌లతో జాగ్రత్త.. వారు వాడకపోవడమే మంచిదంటోన్న శాస్త్రవేత్తలు..!

Edited By:

Updated on: May 23, 2020 | 8:15 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో మనిషి జీవితం
లాక్‌డౌన్ ముందు, దాని తర్వాత అన్నట్లుగా తయారైంది. మన జీవితంలో మాస్క్‌లు, శానిటైజర్ వాడడం అలవాటుగా మారిపోయింది. అవి లేకుండా బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. అంతేకాకుండా మాస్క్‌లు లేకుండా బయటకు రావొద్దంటూ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఫైన్ కూడా విధిస్తున్నారు. అయితే మాస్క్‌లు వాడటంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారు మాస్క్‌లు ధరించవద్దంటూ బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌లు ధరించడం వల్ల వారికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే సాధారణ ప్రజలు సైతం బిగువుగా ఉండే మాస్క్‌లు ధరించడం వలన ఆక్సిజన్ సరిగ్గా అందక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

ముఖ్యంగా శ్వాస కోస సంబంధించిన వ్యాధులు ఉన్న వారు బయటకు వెళ్లినప్పుడు అది కూడా పక్కవారితో రెండు మీటర్లు భౌతిక దూరాన్ని పాటించడం కుదరనప్పుడు మాత్రమే బిగుతుగా ఉండే మాస్క్‌లు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక సర్జికల్ మాస్క్‌లు సర్జికల్ సిబ్బంది నుంచి రోగులకు రక్షణ కల్పించడం కోసం మాత్రమేనని,  వారితో పాటు రోగులు మాత్రమే ధరిస్తే సరిపోతుందనే చాలా మంది నిపుణులుసూచిస్తున్నారు. కాగా సాధారణ మాస్క్‌ల వలన ప్రయోజనం లేదని, మూడు పొరలు కలిగిన ఎన్-95, అంతకన్నా నాణ్యమైన మాస్క్‌లు వేసుకోవడమే ప్రయోజనకరమని డాక్టర్లు చెబుతున్నారు.

ఇక రోగులు తప్ప ఇతరులు మాస్క్‌లు వాడటం వల్ల వారికి ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ప్రతీసారి మాస్క్‌లను చేతులతో సర్దుకోవడం వలన అనవసరంగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక శ్వాస కోశ ఇబ్బందులు, వ్యాధులు ఉన్న వారు మాత్రం మంచి మాస్క్‌ని అవసరం ఉన్నప్పుడు మాత్రమే ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు- సురేష్, జర్నలిస్ట్, ఢిల్లీ.

Read This Story Also:  ‘ఎఫ్‌ 2’ సీక్వెల్‌.. అనిల్ ఆగాల్సిందేనా..!