కరోనాతో మాజీ క్రికెటర్ మృతి

| Edited By:

Jun 03, 2020 | 12:07 PM

కరోనా వైరస్‌ సోకడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం పాక్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51)కి వైరస్ సోకింది. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1987 నుంచి 2005 వరకూ రియాజ్ కెరీర్‌లో 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు...

కరోనాతో మాజీ క్రికెటర్ మృతి
Follow us on

కరోనా వైరస్‌ సోకడంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం పాక్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ రియాజ్ షేక్(51)కి వైరస్ సోకిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో క్రికెటర్ రియాజ్ షేక్ మరణించారు. ఈ విషయాన్ని మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 1987 నుంచి 2005 వరకూ రియాజ్ కెరీర్‌లో 3 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడారు. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఆయన మెయిన్ ఖాన్ క్రికెట్ అకాడమీలో ప్రధాన కోచ్‌గా చేరారు. రియాజ్‌ కంటే ముందు మరో పాకిస్తాన్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కూడా కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే.

Read More:

గాంధీ ఆస్పత్రిలో ప్రమాదం.. తృటిలో తప్పింది..

సీనియర్ నేత టీవీ చౌదరి కన్నుమూత

అమెరికా, బ్రెజిల్, రష్యాతో పాటూ భారత్‌లోనూ అత్యంత తీవ్రంగా కరోనా..