Konaseema Omicron: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ భారత్‌లో మూడో దశ వ్యాప్తికి కారణమవుతుందనే ఆందోళన నెలకొంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో కేసు వెలుగులోకి వచ్చింది. బంగ్లాదేశ్ నుండి విశాఖ మీదుగా అయినవేల్లి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఈనెల 8న బంగ్లా నుంచి విశాఖ వచ్చాడు. అయినవిల్లి మండలం సిరిపల్లి గ్రామానికి చేరుకున్నాడు. అయితే, ఆ యువకుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. దీంతో యువకుడికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. పలుమార్లు పరీక్షించినా పాజిటివ్ నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు. అతనికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆ యువకుడిని ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కాగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో రాత్రంతా గాలించి యువకుని ఆచూకీ తెలుసుకుని క్వారయింటెన్‌లో ఉంచారు అధికారులు. అతనితో పాటు కాంటాక్ట్‌లో ఉన్న వారికి కూడా జిల్లా వైద్యాధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే విదేశాల నుంచి ఎవరొచ్చినా సమాచారం ఇవ్వాలని జిల్లా వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇదిలావుంటే విదేశాల నుండి యువకుడు రావడంతో గ్రామంలో ఒమిక్రాన్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో కోనసీమ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
Read Also… Andhra Pradesh: ఆ సంస్థలతో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం.. రైతులకు చేకూరనున్న ప్రయోజనం