తెలంగాణ‌లో మ‌రో 13 మందికి పాజిటివ్‌..మొత్తం..

రాష్ట్రంలో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైర‌స్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువ‌లో ఉంది.

తెలంగాణ‌లో మ‌రో 13 మందికి పాజిటివ్‌..మొత్తం..

Updated on: Apr 25, 2020 | 9:33 AM

రాష్ట్రంలో క‌రోనా క‌రాళ‌నృత్యం చేస్తోంది. రోజురోజుకూ వైర‌స్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువ‌లో ఉంది. గ‌డిచిన 24గంట‌ల్లో రాష్ట్రంలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 983కి చేరింది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్ల‌డించింది. వీరిలో కరోనాతో పోరాడుతూ 291 మంది కోలుకున్నారు. మొత్తంగా 25 మంది మరణించారు.
క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌ల్ని కంగారు పెడుతున్న మ‌రో  అంశం ఏంటంటే..క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోనే న‌మోదుకావ‌డం గ‌మ‌న్హారం. ఆ త‌ర్వాత స్థానంలో సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్న‌ట్లు అధికారులు తెలిపారు.  వికారాబాద్‌లో 14 కుటుంబాల్లో 38 మంది పేషెంట్లు, గద్వాలలో 30 కుటుంబాల్లో 45 మంది, సూర్యాపేటలో 25 కుటుంబాల్లో 83 మంది, జీహెచ్‌ఎంసీలో 44 కుటుంబాల్లో 260 మంది కరోనా బారినపడినట్లు వివ‌రించారు. రాష్ట్రంలో మొత్తం 663 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని… ఏడుగురు మాత్రమే వెంటిలేటర్‌పై ఉన్నట్లు ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.