కరోనా అప్‌డేట్స్‌: 30లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు.. ఒక్క అమెరికాలోనే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు.

కరోనా అప్‌డేట్స్‌: 30లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు.. ఒక్క అమెరికాలోనే..!

Edited By:

Updated on: Apr 28, 2020 | 9:04 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి ఆగడం లేదు. మొత్తం 210 దేశాలకు ఈ వైరస్‌ విస్తరించగా.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 30,42,444కు చేరింది. వీరిలో 2,11,216 మంది మృత్యువాతపడగా.. 8,94,574 మంది కోలుకున్నారు. ఇక దేశాల వారీగా అగ్రరాజ్యం అమెరికాలో 10,11,006పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 1,13,856 మంది కోలుకోగా.. 56,752 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటిన దేశాల్లో అమెరికా తరువాత స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, లండన్, టర్కీ‌ దేశాలు ఉన్నాయి. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో ఇరాన్‌, చైనా,రష్యా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

Read This Story Also: షాకింగ్.. ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా..!