వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 99 లక్షలు… 4.97 లక్షల మరణాలు..

ప్రపంచంలో 9,920,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అటు గడిచిన 24 గంటల్లో 4.893 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 497,261 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,373,115 మంది కోలుకున్నారు.

వరల్డ్ అప్డేట్: కరోనా కేసులు @ 99 లక్షలు… 4.97 లక్షల మరణాలు..

Updated on: Jun 27, 2020 | 2:26 PM

ప్రపంచదేశాలలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య కోటికి దగ్గరవుతోంది. ఇప్పటివరకు ప్రపంచంలో 9,920,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అటు గడిచిన 24 గంటల్లో 4.893 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి 497,261 మంది ప్రాణాలు కోల్పోగా.. 5,373,115 మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికా, రష్యా, బ్రెజిల్, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యధిక కేసులు(2,553,068), మరణాలు(127,640) అమెరికాలో నమోదయ్యాయి. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 509,753 కేసులు నమోదు కాగా.. 15,700 మంది మృతి చెందారు. కాగా, ఇండియాలో మరణాల రేట్ కంటే రికవరీ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి.

కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల లిస్ట్…

  • అమెరికా – 2,553,068 కేసులు, 127,640 మరణాలు
  • బ్రెజిల్ – 1,280,054 కేసులు, 56,109 మరణాలు
  • రష్యా – 627,646 కేసులు, 8,969 మరణాలు
  • ఇండియా – 509,753 కేసులు, 15,700 మరణాలు
  • బ్రిటన్ – 309,360 కేసులు, 43,414 మరణాలు
Loading...
Unable to load recommendations.
Follow Us