బ్రేకింగ్: ఏపీలోని గ్రామ వాలంటీర్‌కు కరోనా

| Edited By:

Jun 04, 2020 | 2:14 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతూన్నాయి. కాగా తాజాగా ఏపీలోని వాలంటీర్‌కు కరోనా వైరస్ సోకింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వాలంటీర్‌కు...

బ్రేకింగ్: ఏపీలోని గ్రామ వాలంటీర్‌కు కరోనా
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని కరోనావైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే నమోదవుతూన్నాయి. కాగా తాజాగా ఏపీలోని వాలంటీర్‌కు కరోనా వైరస్ సోకింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని వాలంటీర్‌కు కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో వాలంటీర్‌ కుటుంబ సభ్యులను కూడా టెస్టులు చేస్తున్నారు అధికారులు. అలాగే వాలంటీర్ ఎక్కడెక్కడ విధులు నిర్వహించారో.. ఎవరెవరిని కలిశారో.. అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్‌ను పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,377కి చేరింది. మరో 29 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 1,033 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,273 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 71కి చేరింది. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 43 మందికి కరోనా నిర్థారణ అయ్యింది.

Read More: 

ఫోన్లో 17 రకాల ఆర్టీఏ సేవలు.. ఇక నో ఆఫీస్..

బాలీవుడ్‌ మరో విషాదం.. ఆయన ఇక లేరు