Corona Updates: ఏపీలో పెరిగిన కేసులు.. తెలంగాణలో తగ్గుముఖం..!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అటు ఏపీలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. తెలంగాణలో తగ్గుముఖం పడ్డాయి.

Corona Updates: ఏపీలో పెరిగిన కేసులు.. తెలంగాణలో తగ్గుముఖం..!

Updated on: Apr 27, 2020 | 9:36 PM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అటు ఏపీలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండగా.. తెలంగాణలో తగ్గుముఖం పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం.. ఏపీలో ఇప్పటివరకు 1177 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 31 మంది మృత్యువాతపడ్డారు. ఇవాళ కృష్ణా జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 23, కర్నూలు 13, నెల్లూరు జిల్లాలో 7, పశ్చిమగోదావరి జిల్లా 3, శ్రీకాకుళం జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూల్‌లో కేసులు ఉండగా.. ఆ తరువాత గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయి.

ఇక ఇటు తెలంగాణలో ఈరోజు 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివేనని వైద్యారోగ్యశాఖ అధికారులు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,003కు చేరింది. ఈరోజు 16 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 646 యాక్టింగ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 25 మంది మృతి చెందారు.

Read This Story Also: ‘మిరాకల్‌ బేబీ’.. కరోనాను జయించిన ఈ చిన్నారి కథ తెలిస్తే..!

Loading...
Unable to load recommendations.
Follow Us