కరోనా విజృంభణ- కొత్త‌గా 80 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మరింత విజృంభిస్తూనే ఉంది. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి.

కరోనా విజృంభణ- కొత్త‌గా 80 పాజిటివ్ కేసులు

Updated on: Apr 27, 2020 | 11:58 AM

ఏపీలో కరోనా విజృంభణ ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కేవలం 24 గంటల్లోనే కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1177కు చేరుకుంది.
గడిచిన‌ 24 గంటల్లో అత్యధికంగా కృష్ణాజిల్లాలో 33 కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.
గడచిన 24 గంటల వరకు 6517 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ మేర‌కు కర్నూల్ లో 13, గుంటూరు 23, కృష్ణా 33, కడప 3, ప్రకాశం 3, నెల్లూరు 7, శ్రీకాకుళం 1, వెస్ట్ గోదావరి 3, చొప్పున కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 292 కేసులు, గుంటూరు 237,కృష్ణా జిల్లాలో 210 కేసులు నమోదు. కరోనా సోకిన వారిలో  235 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌. వివిధ ఆసుపత్రుల్లో 911 మందికి చికిత్స కొన‌సాగుతోంది. కరోనా మరణాల సంఖ్యలో మార్పు లేదు. గత 24 గంటల్లో ఎవ్వరూ చనిపోలేదు.. మొత్తంగా 31 మంది చనిపోయారు.
రాష్ట్రంలో క‌రోనా గ‌త‌ నాలుగు ఐదు రోజులుగా రోజుకూ 50కి పైగానే పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మ‌రోవైపు మ‌రో ఆరు రోజుల్లో కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ గ‌డువు ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో ఏపీలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా..? లేక మ‌రికొన్ని రోజుల పాటు పొడిగిస్తారా…? అన్నసందేహం ఉత్ప‌న్న‌మ‌వుతోంది. కేసుల తీవ్ర‌త ఈ విధంగానే కొన‌సాగితే మాత్రం లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.