దారుణానికి ఒడిగట్టిన చైనా.. ఇటలీ పరిస్థితి తలక్రిందులు..

|

Apr 07, 2020 | 11:59 AM

Coronavirus Outbreak: చైనాలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న వేళ.. ఇటలీ ఆ దేశానికీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను ఉచితంగా పంపించింది. ఇక ఇప్పుడు ఇటలీ కరోనా దెబ్బకు PPEల కొరతతో అల్లాడుతున్నప్పుడు ఆ దేశం ఫ్రీగా ఇచ్చిన PPEలను అమ్మిందని స్పెక్టేటర్ మ్యాగజైన్ పేర్కొంది. డ్రాగన్ కంట్రీలోని వుహన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మహమ్మారి ఇటలీలో మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడ ఎక్కువగా డాక్టర్లు, నర్సులు ఈ కోవిడ్ 19 బారిన పడుతున్నారు. ఈ […]

దారుణానికి ఒడిగట్టిన చైనా.. ఇటలీ పరిస్థితి తలక్రిందులు..
Follow us on

Coronavirus Outbreak: చైనాలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న వేళ.. ఇటలీ ఆ దేశానికీ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను ఉచితంగా పంపించింది. ఇక ఇప్పుడు ఇటలీ కరోనా దెబ్బకు PPEల కొరతతో అల్లాడుతున్నప్పుడు ఆ దేశం ఫ్రీగా ఇచ్చిన PPEలను అమ్మిందని స్పెక్టేటర్ మ్యాగజైన్ పేర్కొంది.

డ్రాగన్ కంట్రీలోని వుహన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ మహమ్మారి ఇటలీలో మరణ మృదంగం వాయిస్తోంది. అక్కడ ఎక్కువగా డాక్టర్లు, నర్సులు ఈ కోవిడ్ 19 బారిన పడుతున్నారు. ఈ వైరస్ దాటికి ఇటలీలో మరణాల సంఖ్య 16,523కి చేరింది. అంతేకాక 132,547 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఇలాంటి తరుణంలో చైనా సంక్షోభం నుంచి కోలుకుని మానవతా దృక్పధంతో ఇటలీకి PPEలను డొనేట్ చేస్తున్నామని ప్రపంచానికి చెబుతోంది. అయితే అవన్నీ వట్టి మాటలేనని.. మానవత్వం చాటున బిజినెస్ చేసిందని వివిధ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఏదైనా చైనా వక్రబుద్ధి మళ్లీ చూపించిందని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

ఇది చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మార్గదర్శకాలు..