‘ఆరోగ్య సేతు’ యాప్ సరికొత్త రికార్డు.. రెండు వారాల్లో 50 మిలియన్ డౌన్‌లోడ్స్‌…

|

Apr 15, 2020 | 9:01 PM

కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా మన దరికి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి.. అలాగే ఐఫోన్‌ ఉపయోగించేవారు యాప్ స్టోర్‌లలో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పని […]

ఆరోగ్య సేతు యాప్ సరికొత్త రికార్డు.. రెండు వారాల్లో 50 మిలియన్ డౌన్‌లోడ్స్‌...
Follow us on

కరోనా వైరస్ ప్రభావం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ అనే యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. కరోనా మన దరికి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి.. అలాగే ఐఫోన్‌ ఉపయోగించేవారు యాప్ స్టోర్‌లలో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి.

అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా పని చేసే ఈ ‘ఆరోగ్య సేతు’ అప్లికేషన్ నుంచి దేశంలో కరోనా కేసుల రిపోర్టు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అంతేకాక కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గరకు మీరు వెళ్తే తక్షణమే మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది. ఇలా ప్రజలను మహమ్మారి వైరస్ నుంచి రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడే ఈ యాప్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

వరల్డ్‌లో మోస్ట్ పాపులారిటీని సొంతం చేసుకున్న ‘పోకీమాన్ గో’ గేమ్ డౌన్‌లోడ్స్‌ను ఈ యాప్‌ బీట్‌ చేసింది. గత 13 రోజుల్లోనే ఈ ‘ఆరోగ్య సేతు’ యాప్ 50 మిలియన్ల యూజర్లను సంపాదించుకుని కొత్త రికార్డును సృష్టించింది. కాగా, లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.