లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి…

|

Apr 20, 2020 | 7:22 AM

కరోనా వైరస్ ప్రభావం కారణంగా కేంద్రం మే 3 వరకూ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది. అయితే పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థ దృష్ట్యా రెండోదశ లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు చేసిన సంగతి తెలిసిందే. అవి ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే కరోనా దాటికి దేశం తీవ్రమైన ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది. దీనితో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 2.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇక వీటిని అమలు చేసేది లేనిది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి […]

లాక్ డౌన్ సడలింపులు.. నేటి నుంచి వీటికి అనుమతి...
Follow us on

కరోనా వైరస్ ప్రభావం కారణంగా కేంద్రం మే 3 వరకూ దేశవ్యాప్త లాక్ డౌన్ విధించింది. అయితే పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థ దృష్ట్యా రెండోదశ లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు చేసిన సంగతి తెలిసిందే. అవి ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటికే కరోనా దాటికి దేశం తీవ్రమైన ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయింది. దీనితో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 2.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇక వీటిని అమలు చేసేది లేనిది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర, ఏపీ ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మే 7 వరకు సడలింపుల్లేకుండానే లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక రెడ్ జోన్లలో మాత్రం కఠినంగానే చర్యలు అమలు కానున్నాయి.

కేంద్ర సడలింపులు.. నేటి నుంచి తెరుచుకునేవి ఇవే:

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆఫీసులు తెరుచుకుంటాయి
  • అత్యవసర సేవలకు, వైద్య, అత్యవసర సరుకులు, తాము పనిచేసే ఆఫీస్‌కి వెళ్లడానికి ప్రైవేటు వాహనాలకు అనుమతి
  • గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ యూనిట్ల పరిశ్రమలు తెరవచ్చు
  • మూవీ థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్‌లు, స్పోర్ట్స్, స్మిమ్మింగ్ ఫూల్స్, బార్లు మాత్రం మే నెల 3వ తేదీ వరకూ తెరవకూడదు
  • ప్రజా రవాణా అంతా కూడా మే 3 వరకూ లాక్‌డౌన్‌లోనే ఉంటాయి
  • అత్యవసర, నిత్యావసర సరుకుల సరఫరా కొనసాగనుంది
  • వాణిజ్య, ప్రైవేటు వర్తక సంస్థలకు, ప్రభుత్వ, ప్రభుత్వేతర పారిశ్రామిక సంస్థలు పనిచేయవచ్చు
  • విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మే 3 వరకూ బంద్‌లో ఉంటాయి
  • నిర్మాణ రంగ కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే కార్మికులు నిర్మాణం దగ్గరే నివసించాలి. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • అంత్యక్రియలకు 20 మందికి మించి పాల్గొనకూడదు
  • ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లీనిక్స్, టెలీ మెడిసన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి.
  • అలాగే మే 3 వరకూ ఫంక్షన్లు, వేడుకలు, మతపరమైన కార్యక్రమాలు, ప్రార్థనా మందిరాలు క్లోజ్ చేసి ఉంటాయి.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..