Omicron: కలవర పెడుతున్న ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే 70 రెట్లు అధికం.. తాజా అధ్యయనంలో సంచలనాలు!

|

Dec 16, 2021 | 2:42 PM

Covid Omicron Variant: కరోనా మహమ్మారి పీడ ఇప్పుడప్పుడే వదిలేలా లేదు.. కొత్త రూపం మార్చుకున్న కొవిడ్ రాకాసి ఒమిక్రాన్ వేరియంట్‌తో విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది.

Omicron: కలవర పెడుతున్న ఒమిక్రాన్.. డెల్టా వేరియంట్ కంటే 70 రెట్లు అధికం.. తాజా అధ్యయనంలో సంచలనాలు!
Omicron
Follow us on

Covid 19 Omicron infects: కరోనా మహమ్మారి పీడ ఇప్పుడప్పుడే వదిలేలా లేదు.. కొత్త రూపం మార్చుకున్న కొవిడ్ రాకాసి ఒమిక్రాన్ వేరియంట్‌తో విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా.. లేటేస్ట్‌గా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని లేదు.. దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త ప్రాంతాలను వెతుకుంటూ విస్తరిస్తోంది ఒమిక్రాన్‌ వేరియంట్.

అటు దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. గురువారం ఢిల్లీలో 4 కొత్త కేసులు ఒమిక్రాన్‌ నిర్ధారించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 10కి చేరింది. దీనిపై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ, ఢిల్లీలో ఒమిక్రాన్‌ పాజిటివ్ రోగుల సంఖ్య 10కి చేరుకున్నట్లు ప్రకటించారు.ఈ రోగులలో ఒకరు కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం మొత్తం 9 మంది ఒమిక్రాన్‌ పాజిటివ్ రోగులు ఎల్‌ఎన్‌జెపిలో చేరారని ఆయన చెప్పారు. ఒమిక్రాన్‌తో సంబంధం ఉన్న మొత్తం 40 మంది రోగులు ప్రస్తుతం LNJPలో చేరారు, వారిలో 38 మంది ఆరోగ్యం ఉన్నారు. మరో ఇద్దరు అనుమానితులుగా ఉన్నారు. ఈ ఉదయం విమానాశ్రయం నుంచి మరో 8 మంది అనుమానితులు వచ్చినట్లు జైన్ తెలిపారు. విమానాశ్రయం నుంచి వస్తున్న చాలా మందికి పాజిటివ్‌గా తేలింది. ఎల్‌ఎన్‌జెపిలో 40 పడకల ప్రత్యేక ఒమిక్రాన్‌ వార్డు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇక్కడ పడకల సంఖ్యను 100కి పెంచారు.

అటు ,పశ్చిమ బెంగాల్ తమిళనాడులో మొదటి ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో, ఏడేళ్ల బాలుడు అబుదాబి నుండి హైదరాబాద్ మీదుగా తిరిగి వచ్చిన తర్వాత కొత్త కరోనావైరస్ వేరియంట్‌కు పాజిటివ్ గా తేలింది. తమిళనాడులో, నైజీరియా నుండి వచ్చిన 47 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ సోకినట్లు తేలింది. కోవిడ్ 19 పాజిటివ్ అని తేలిన అతని కుటుంబ సభ్యులలో ఆరుగురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.

ఇదిలావుంటే, వైద్య నిపుణులు విశ్లేషణలు మరింత ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ 19 స్ట్రెయిన్ డెల్టా కంటే 70 రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన కల్లోలం నుంచి తెరుకోకముందే కొత్త వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. రెండో విడతలో కరోనా డెల్టా వేరియంట్ రూపంలో ప్రాణాలను హరించి వేసింది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై దాడిచేసి బాధితుల్ని దెబ్బతీయడం సహా ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి తీసుకెళ్లింది. అయితే, ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్ మాత్రం.. డెల్టా కంటే అత్యంత ప్రమాదకరమైనదని తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.

కరోనా అనేది సూర్యుని వాతావరణం బయటి పొర, ఇక్కడ బలమైన అయస్కాంత క్షేత్రాలు ప్లాస్మాను బంధిస్తాయి. అల్లకల్లోలమైన సౌర గాలులు తప్పించుకోకుండా నిరోధిస్తాయి. నాసా అంతరిక్ష నౌక సూర్యుడిని తాకడం ద్వారా మైలురాయిని సాధించింది. చాలా మంది రోగులకు అనారోగ్యానికి ఆక్సిజన్ లేదా ఇంటెన్సివ్ ట్రీట్‌మెంట్ అవసరం లేదని ప్రారంభ పరిశోధనల్లో వెల్లడైంది. ఈనేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా చాలా మంది ప్రజారోగ్య నిపుణులు, వైద్య సంస్థలు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

శరీరంలోకి గాలి ప్రవేశించే మార్గాల ద్వారా ఒమిక్రాన్‌ వేరియంట్.. డెల్టా కంటే 70 రెట్లు వేగంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఈ వేరియంట్ చాలా వేగంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తోందని భావిస్తున్నారు. కానీ, శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఊపిరితిత్తుల కణజాలాల్లోకి చేరడంలో మాత్రం ఒమిక్రాన్‌.. కరోనా అసలు వేరియంట్‌తో పోలిస్తే 10 రెట్లు నెమ్మదిగా పయనిస్తున్నట్లు గుర్తించారు. ఫలితంగానే ఒమిక్రాన్‌ సోకినప్పటికీ… బాధితులు తీవ్రంగా ప్రభావితం కావడం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఒమిక్రాన్‌పై అధ్యయనంలో గుర్తించిన అంశాలను.. ఇంకా ప్రచురించలేదు. అందువల్ల ఆ వివరాలను పరిశోధకులు బయటకు విడుదల చేయలేదు.

కానీ, హాంకాంగ్‌ యూనివర్సిటీ ఒక వార్తను విడుదల చేసింది. వైరస్‌ పరివర్తన కారణంగా.. మనుషుల్లో ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపడం లేదనే విషయాన్ని గమనించినట్లు అధ్యయన బృందం సారథి డాక్టర్‌ మిచెల్‌ చాన్‌ చీ వాయ్ చెప్పారు. ఇందులో ఆయా వ్యక్తుల రోగనిరోధక శక్తి ప్రతిస్పందన కూడా కీలకపాత్ర పోషించవచ్చని పేర్కొన్నారు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండేవారి ప్రాణాలకు మాత్రం.. ముప్పు వాటిల్లే అవకాశముందని అంచనా వేశారు. ఎక్కువ మందికి వ్యాపించడం ద్వారా వైరస్‌ క్రమంగా ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు హెచ్చరించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్.. వ్యాక్సిన్ల ద్వారా వచ్చే వ్యాధి నిరోధక శక్తిని పాక్షికంగా తప్పించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకే కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తూ వస్తోంది.

కరోనా కొత్త రూపం దాల్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ శక్తివంతం కావడంతో అదనపు కోరలు కలిగి ఉండటంతో అది కణాలను చాలా గట్టిగా పట్టుకొని ఉంటుందని.. అమెరికా న్యూజెర్సీలోని జోసెఫ్‌ లుబిన్‌ రూగర్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కణజాలాల్లోకి ఇన్ఫెక్షన్‌కు పంపేందుకు.. ఒమిక్రాన్‌ మ్యుటేషన్స్‌ సహకరిస్తాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో.. మానవ శరీరంలోని యాంటీబాడీలు వైరస్‌పై పోరాటంలో తీవ్రస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది. కొన్ని యాంటీబాడీలు సమర్థంగా ఉన్నప్పటికీ, మరికొన్ని బలహీనపడే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చిరిస్తున్నారు. ఈ క్రమంలో బలహీనమైన యమాంటీబాడీలు ఉన్న వారికి ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించవచ్చని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బూస్టర్‌ డోసులు యాంటీబాడీలను మరింత క్రీయాశీలకం చేస్తాయని.. పరిశోధకులు వివరించారు. అందువల్ల బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే..ఈ వేరియంట్‌పై సమర్థంగా పోరాడవచ్చని తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌ సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేని వారు ప్రపంచవ్యాప్తంగా 40.5శాతం కేసులు పెరగడానికి కారణమవుతున్నట్లు.. మరో అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఈ అధ్యయనంలో 19వేల 884 మంది పాల్గొనగా.. వారిలో 40 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు. ఇలాంటి వారి ద్వారానే వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడించారు.

Read Also… ఒకే కుటుంబంలో వరుస మరణాలు.. రోజుల వ్యవధిలో దంపతుల మరణం.. తట్టుకోలేక అమ్మ, తమ్ముడు మృతి.. అనాథులైన చిన్నారులు!