స్మిత్, వార్నర్ రాకతోనే ఆస్ట్రేలియా సిరీస్ మజా…

|

Apr 23, 2020 | 12:50 PM

ఆస్ట్రేలియా జట్టులోకి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో ఈ ఏడాది చివరన జరగాల్సిన ఆసీస్ సిరీస్ పూర్తి భిన్నంగా ఉంటుందని.. మునపటి మాదిరిగా ఉండదని హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

స్మిత్, వార్నర్ రాకతోనే ఆస్ట్రేలియా సిరీస్ మజా...
Follow us on

ఆస్ట్రేలియా జట్టులోకి స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో ఈ ఏడాది చివరన జరగాల్సిన ఆసీస్ సిరీస్ పూర్తి భిన్నంగా ఉంటుందని.. మునపటి మాదిరిగా ఉండదని హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. 2018-19లో భారత్ ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు నిషేధం కారణంగా స్మిత్, వార్నర్ ఆసీస్ జట్టులో ఆడలేకపోయారు. ఇక ఇప్పుడు పరిస్థితి కాస్త విభిన్నంగా ఉంటుంది.

కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత ఆస్ట్రేలియా, భారత్ మధ్య సిరీస్ జరిగితే తప్పకుండా రసవత్తరంగా ఉంటుందని.. తాను ఆడడానికి సిద్దంగా ఉన్నానని రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం భారత్ జట్టు దుర్భేద్యంగా ఉందని.. ఖచ్చితంగా తమకు ప్రత్యర్ధిగా ధీటైన జట్టు ఉంటే సిరీస్ అద్భుతంగా ఉంటుందని భారత్ వన్డే వైస్ కెప్టెన్ వివరించాడు. కాగా, అక్టోబర్ నుంచి భారత్ ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. నవంబర్‌లో టి20 ప్రపంచకప్‌ కూడా ఆసీస్ గడ్డపైనే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇవన్నింటిపైనా కరోనా మహమ్మారి సెగ తగిలింది.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

డిగ్రీ విద్యార్ధులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

కరోనా పరీక్షల నిర్వహణలో ఏపీ అగ్రస్థానం..

లాక్ డౌన్ వేళ.. అదిరిపోయే పబ్జీ కాంపిటీషన్.. ప్రో-ప్లేయర్స్ గెట్ రెడీ..

లాక్‌డౌన్‌ ఉల్లంఘించి పార్టీ చేసుకున్న గ్రామ వాలంటీర్లు..