ఏటీఎంల ద్వారా ఫోన్ రీచార్జ్.. కొందరికి మాత్రమే వర్తింపు..

|

Mar 31, 2020 | 10:50 PM

Coronavirus Lockdown:  దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వినియోగదారులకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. జియో వినియోగదారులందరూ తమ మొబైల్ నెంబర్లను దగ్గరలో ఉన్న ఏటీఎంల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చునని సంస్థ వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లతో సహా వివిధ బ్యాంకుల నుంచి పొందవచ్చని ట్విట్టర్ ద్వారా పేర్కొంది. ఏటీఎం […]

ఏటీఎంల ద్వారా ఫోన్ రీచార్జ్.. కొందరికి మాత్రమే వర్తింపు..
Follow us on

Coronavirus Lockdown:  దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వినియోగదారులకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. జియో వినియోగదారులందరూ తమ మొబైల్ నెంబర్లను దగ్గరలో ఉన్న ఏటీఎంల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చునని సంస్థ వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ లతో సహా వివిధ బ్యాంకుల నుంచి పొందవచ్చని ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

ఏటీఎం ద్వారా రీచార్జ్ చేసుకునేటప్పుడు జియో యూజర్లు రీచార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి.. ఎంత అయితే రీచార్జ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ నెంబర్ ను ఎంటర్ చేయాలి. అంటే మీ ఎకౌంటు నుంచి డైరెక్ట్ గా డబ్బులు కట్ అయ్యి.. ఫోన్ రీచార్జ్ అయిపోతుంది. అనంతరం మీ ఫోన్ కు కూడా రీచార్జ్ అయినట్లు మెసేజ్ వస్తుంది. కాగా వర్క్ ఫ్రమ్ హోం చేసేవారికి జియో ప్రీపెయిడ్ ప్లాన్ ను వెల్లడించిన సంగతి తెలిసిందే. రూ.251 ప్యాక్ ద్వారా 51 రోజులకు 2జీబీ డేటాను పొందవచ్చు.

ఇవి చదవండి:

మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..

EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..

తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..