ఐదు నిమిషాల్లోనే ‘కరోనా’ పరీక్ష నిర్ధారణ.. కిట్ తయారుచేసిన అమెరికన్ సంస్థ..!

ఐదు నిమిషాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని తయారు చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని ఇచ్చింది.

ఐదు నిమిషాల్లోనే 'కరోనా' పరీక్ష నిర్ధారణ.. కిట్ తయారుచేసిన అమెరికన్ సంస్థ..!
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 3:04 PM

ఐదు నిమిషాల్లోనే కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసే పరికరాన్ని తయారు చేసినట్లు అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని ఇచ్చింది. కానీ పూర్తి స్థాయి ఆమోదం మాత్రం లభించలేదని సంస్థ తెలిపింది. వచ్చే వారమే ఈ పరికరం అందుబాటులోకి రానుందని ఆ సంస్థ వివరించింది. వ్యక్తి నమునాలను పరీక్షించి.. కరోనా వైరస్‌ ఉంటే ఐదు నిమిషాల్లోనే ఫలితాన్ని చెబుతుందని పేర్కొంది. ఒకవేళ నెగిటివ్ ఉంటే 13 నిమిషాల్లో ఈ పరికం తేలుస్తుందని ఆ సంస్థ తెలిపింది.

ఈ పరికరం చిన్న పరిమాణంలో ఉండటం వలన.. ఎక్కడైనా దీన్ని వినియోగించొచ్చని.. హాస్పిటల్ బయటే పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందని ఆ సంస్థ వివరించింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దీనిని ఉపయోగానికి ఎఫ్‌డీఏతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ ఆపరేటింగ్ ఆఫీసర్ రాబర్ట్ ఫోర్ట్ అన్నారు. కరోనా వైరస్‌ జయించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయమని.. ఆ దిశగానే తమ సంస్థ సైతం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read This Story Also: కరోనాపై పోరాటం: సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం.. టీటీడీ మాటేంటి..!