Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 58 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 158333. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 86110. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 67692. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4531. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి నేడు రెండో రోజు మహానాడు కార్యక్రమం. ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్న రెండో రోజు మహానాడు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించనున్న టీడీపీ.
  • తిరుమల: నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. లాక్ డౌన్ దృష్డ్యా మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనునన్న టీటీడీ బోర్డు సమావేశం. పది గంటలకు ప్రారంభం కానున్న సమావేశం. సిస్కో వెబ్ ఎక్స్ యాప్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న బోర్డు సభ్యులు. 60 అంశాలతో ఎజెండా. నిరరార్ధక ఆస్తుల వేలం తీర్మానంపై కీలకంగా చర్చించనున్న బోర్డు. ప్రభుత్వ అదేశాలనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం, వసతి సదుపాయాల కల్పన విధివిధానాలపై చర్చించనున్న పాలకమండలి టీటీడీ ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం.
  • ఎన్టీఆర్ 97 వ జయంతి సందర్భంగా ఎన్టిఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన బాలకృష్ణ దంపతులు , సుహాసిని.
  • అమరావతి హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు ఏడుగురు పై కేసులు నమోదు చేసిన సీఐడీ.. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. విచారణకు హాజరు కావాలని పలువురికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ..
  • హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం కోరింది.
  • కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో ఇవాళ 107 పాజిటివ్ కేసులు నమోదు. * సౌదీ అరేబియా 49, వలస కార్మికులు 19 పాజిటివ్ కేసులు నమోదు. ఇవ్వాళ కొత్తగా 6మంది మృతి. ఇప్పటి వరకు మొత్తం 64కి చేరిన మృతుల సంఖ్య. ఇవాళ 37 మంది డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1321 మంది డిశ్చార్జి.

కరోనాపై పోరాటం: సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం.. టీటీడీ మాటేంటి..!

కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు పలువురు. సినీ, క్రీడా, రాజకీయ తేడా లేకుండా పలు రంగాల్లోని సెలబ్రిటీలు తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు.
Coronavirus relief funds, కరోనాపై పోరాటం: సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం.. టీటీడీ మాటేంటి..!

కరోనా మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న పోరాటానికి తమ వంతు సహాయం చేస్తున్నారు పలువురు. సినీ, క్రీడా, రాజకీయ తేడా లేకుండా పలు రంగాల్లోని సెలబ్రిటీలు తమకు తోచినంత విరాళాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భూరి విరాళం ప్రకటించింది. తమ సంస్థ తరఫున రూ.51కోట్ల రూపాయలు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నట్లు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది.

కాగా ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు టీటీడీ(తిరుమల తిరుమల దేవస్థానం) సాధారణంగా విరాళాలు ఇస్తూ వస్తుంటుంది. మరి వందల కోట్ల ఆదాయాన్ని ఘడించే ఈ బోర్డు.. కరోనాపై యుద్ధానికి ఎన్ని కోట్లు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ విరాళంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే భారీ ప్రకటన చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.. కాగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 840కు పైగా చేరగా.. 17మంది ఈ వైరస్ తో మరణించారు.

Read This Story Also: కరోనా లాక్‌డౌన్‌.. తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం..!

Related Tags