తెలంగాణలో 700కు చేరిన పాజిటివ్ కేసులు..ఏపీలో…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం కేవలం 6 కేసులు మాత్రమే నమోద్వడం కాస్త ఊరటనిచ్చిందనుకుంటే.. గురువారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఒక్కరోజే కొత్తగా మరో 50 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరింది. ఇక గురువారం నమోదైన కొత్త కేసులు 90 శాతం వరకు హైదరాబాద్‌ పరిసరాలకు సంబంధించినవేన్నారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్. […]

తెలంగాణలో 700కు చేరిన పాజిటివ్ కేసులు..ఏపీలో...

Edited By:

Updated on: Apr 16, 2020 | 10:59 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. బుధవారం కేవలం 6 కేసులు మాత్రమే నమోద్వడం కాస్త ఊరటనిచ్చిందనుకుంటే.. గురువారం మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఒక్కరోజే కొత్తగా మరో 50 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 700కు చేరింది. ఇక గురువారం నమోదైన కొత్త కేసులు 90 శాతం వరకు హైదరాబాద్‌ పరిసరాలకు సంబంధించినవేన్నారు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్.

గురువారం మరో 68మంది కరోనానను జయించి.. డిశ్చార్జి అయ్యారని.. వీరికి 14 రోజులు అనంతరం.. బుధవారం జరిపిన తొలి టెస్టులో నెగిటివ్ వచ్చిందని.. ఇక గురువారం జరిపిన పరీక్షల్లో కూడా నెగిటివ్‌గా వచ్చిందని.. దీంతో వీరిని డిశ్చార్జ్ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని.. ముగ్గురు మాత్రం వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు.

 

ఇక..ఏపీలో గురువారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 525కి చేరింది. కొత్తగా మరో 23  కేసులు నమోదైయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 14 మంది మృతిచెందారు. ప్రస్తుతం 491 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.