ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. అత్యధికంగా గుంటూరు జిల్లాలో…

ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 525 కి చేరింది. బుధవారం ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు కొత్తగా నమోదైన కేసుల వివరాలను తెల్పుతు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్‌ ప్రకారం బుధవారం కొత్తగా మరో 23 కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం […]

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. అత్యధికంగా గుంటూరు జిల్లాలో...

Updated on: Apr 15, 2020 | 10:20 PM

ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 525 కి చేరింది. బుధవారం ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు కొత్తగా నమోదైన కేసుల వివరాలను తెల్పుతు ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. ఈ బులిటెన్‌ ప్రకారం బుధవారం కొత్తగా మరో 23 కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి ముగ్గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

బుధవారం కొత్తగా కర్నూలు జిల్లాలో 13, గుంటూరు జిల్లాలో 4, కడప జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఇప్పటివరకూ 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను మినహాయిస్తే.. మిగతా 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం కరోనా హాట్‌స్పాట్ జిల్లాలుగా ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ బారినపడి 14 మంది మృతి చెందారు.

Loading...
Unable to load recommendations.
Follow Us