ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విస్తృతి తగ్గటం లేదు. ఇంకా వెంటాడుతూనే ఉంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం నుంచి ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 39 కేసులు రికార్డయ్యాయి. ఇందులో గుంటూరులో 13, కర్నూలు 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతతం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య 761కి చేరింది.
ఇక జిల్లాల వారిగా చూసుకుంటే..కర్నూలు 18. గుంటూరు 16, కృష్ణా 83. నెల్లూరు 67. చిత్తూరు 53. కడప 46. ప్రకాశం 44. పశ్చిమ గోదావరి 39. అనంతపురం 36. తూర్పుగోదావరి 26. విశాఖపట్టణం 21 కేసులు నమోదయ్యాయి. గడిచిన రెండు రోజులు సోమవారం 20, మంగళవారం 13 కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారయంత్రాంగం మరింత అప్రమత్తమైంది. వ్యాధి మరింత విస్తరించకుండా ఉండేందుకు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. నరసరావుపేటలో 20 కేసులు నమోదు కావడంతో వ్యాధి నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మొత్తం 1400 పైగా వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ఎన్ని కేసులు నమోదవుతాయనే టెన్షన్ నెలకొంది.