క‌రోనా “మ‌హా” విల‌యం..30వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు

|

May 16, 2020 | 8:27 AM

దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వంద‌ల కేసులు న‌మోదు అవుతుండ‌గా, మ‌రికొన్ని రాష్ట్రాల్లో అస‌లు కేసు న‌మోదు లేదు. ఇదిలా ఉంటే, క‌రోనా వైర‌స్ మహారాష్ట్రను వ‌ణికిస్తోంది.

క‌రోనా మ‌హా విల‌యం..30వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు
Follow us on
దేశ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తూనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో వంద‌ల కేసులు న‌మోదు అవుతుండ‌గా, మ‌రికొన్ని రాష్ట్రాల్లో అస‌లు కేసు న‌మోదు లేదు. ఇందులో ఈశాన్య రాష్ట్రాలైన మ‌ణిపూర్‌లో మూడు క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత మిజోరంలో, ఒక కేసు, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఒక కేసు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రాన‌గ‌ర్ హ‌వేలి, డామ‌న్ డ‌య్యూలో ఒక్క కేసు మాత్ర‌మే న‌మోదు అయ్యాయి. ఇదిలా ఉంటే, క‌రోనా వైర‌స్ మహారాష్ట్రను వ‌ణికిస్తోంది. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసుల సంఖ్య దాదాపుగా 30వేల‌కు చేరువ‌లో ఉంది. దేశంలో అత్య‌ధిక కేసుల‌తో మ‌హారాష్ట్ర ప్ర‌థ‌మ స్థానంలో ఉంది.
మహారాష్ట్రపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మ‌హారాష్ట్ర‌లో శుక్ర‌వారం ఒక్క రోజే కొత్త‌గా 1576 కొత్త క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 29100కి చేరింది. 21468 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క‌రోనా వైర‌స్ బారినప‌డి నిన్న 49 మంది మ‌ర‌ణించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మ‌ర‌ణించిన వారికి సంఖ్య 1068కి చేరింది. ఇక‌ ముంబ‌యిలో కొత్త‌గా 933 కొత్త కేసులు న‌మోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 17671కి చేరింది. ఇటు ముంబై త‌ర్వాత థానే, పూణేలో ఎక్కువ కేసులున్నాయి.