మహారాష్ట్ర రాజ్ భవన్ లో కరోనా కలకలం.. స్వీయ నిర్బంధంలో గవర్నర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 12, 2020 | 2:29 PM

మహారాష్ట్రలో రాజ్ భవన్ లో పని చేస్తున్న సుమారు 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో  గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ  స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇప్పటికే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో..

మహారాష్ట్ర రాజ్ భవన్ లో కరోనా కలకలం.. స్వీయ నిర్బంధంలో గవర్నర్
Follow us on

మహారాష్ట్రలో రాజ్ భవన్ లో పని చేస్తున్న సుమారు 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో  గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ  స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇప్పటికే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారని, రానున్న రోజుల్లో అవసరమైతే ఆయనకు కోవిడ్-19 టెస్టులు నిర్వహిస్తామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. రాజ్ భవన్ స్టాఫ్ క్వార్టర్స్ ని సీల్ చేసి శానిటైజేషన్ చేసే ప్రక్రియను చేపట్టామని, గవర్నర్ కార్యాలయాన్ని ఎనిమిది రోజుల పాటు మూసి ఉంచుతామని వారు చెప్పారు. ఇక కరోనా పాజిటివ్ సోకిన ఉద్యోగులను క్వారంటైన్ కి తరలించారు.

మహారాష్ట్రలో ఒక్క రోజే 223 మంది  కరోనా రోగులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య పది వేలకు పెరిగింది.  నిన్న ఒక్కరోజే 8,139 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 246,600 కి చేరిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు ముంబైలో పరిస్థితి గత నెలతో పోలిస్తే కొంత మెరుగు పడినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి.