వరంగల్‌ ఎంజీఎంలో తొలి కరోనా మరణం

వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది... అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం

వరంగల్‌ ఎంజీఎంలో తొలి కరోనా మరణం

Updated on: Jun 06, 2020 | 6:35 PM

కరోనా మహమ్మారి తెలంగాణను గడగడలాడిస్తున్నది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర జిల్లాల‌కు వేగంగా వ్యాపిస్తోంది. కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఇచ్చిన సడలింపు తర్వాత ఎక్కవ కేసులు పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంలో తొలి కరోనా మరణం నమోదైందని వైద్యాధికారులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లికి చెందిన వెంకటయ్య కరోనాతో ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us