కరోనా వేట: హత్య కేసులో నిందితుడికి పాజిటివ్..

|

Jun 06, 2020 | 10:50 AM

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను వణికిస్తోన్న కరోనా రక్కసి ఆంధ్ర రాష్ట్రంలోనూ అడ్డూ అదుపూ లేకుండా విలయతాండవం చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ పద్ధతుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతూ వస్తోంది. తాజాగా పోలీస్ శాఖలోనూ కరోనా కలవరం మొదలైంది.

కరోనా వేట: హత్య కేసులో నిందితుడికి పాజిటివ్..
Follow us on

ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను వణికిస్తోన్న కరోనా రక్కసి ఆంధ్ర రాష్ట్రంలోనూ అడ్డూ అదుపూ లేకుండా విలయతాండవం చేస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ పద్ధతుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతూ వస్తోంది. తాజాగా పోలీస్ శాఖలోనూ కరోనా కలవరం మొదలైంది. ఓ హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరులో జరిగిన హత్య కేసులో నిందితుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్ధరు పోలీసులను అధికారులు హోమ్ క్యారంటైన్‌కు తరలించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా కేసు బయల్పడన మార్చి 12వ తేదీ నుంచి సరిగ్గా నెల రోజుల పాటు కేసుల సంఖ్య రెండంకెల మీదే ఉంది. ఆ తర్వాత ఢిల్లీ మత ప్రార్థనల కారణంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే ఆయా వర్గాల వారికి కరోనా పరీక్షలు చేయకుండా పలువురు రాజకీయ నాయకులు అడ్డుకోవటం, ఆ తర్వాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కొన్ని చోట్ల పలువురు రాజకీయ పెద్దలు కరోనాతో చనిపోయిన వారి డెడ్‌బాడీలను బంధువులకు ఇచ్చేందుకు జోక్యం చేసుకుని, వాటిని అప్పగించటంతో పలు జిల్లాల్లో కరోనా సామాజిక వ్యాప్తి చెందింది. లారీ డ్రైవర్ల వల్ల కూడా వైరస్‌ అనేక మందికి సోకింది.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపుల వరకు ఇలా అనేక రకాలుగా  వైరస్‌ వ్యాప్తి చెందింది. కానీ ఎప్పుడైతే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు పూర్తిగా గేట్లు ఎత్తేశారో, అప్పటి నుంచి కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రంలోని సచివాలయంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, వివిధ జిల్లాల్లో ఉన్న గ్రామీణులకు కూడా వైరస్‌ సోకింది. వలస కూలీల వల్ల కూడా అనేక కేసులు ప్రస్తుతం బయటపడుతున్నాయి. దీనికి తోడు విదేశాల నుంచి వస్తున్న వారు, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వస్తున్న వారితో రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తిగా దూసుకెళుతూ అందరినీ కలవర పెడుతోంది.