రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం

| Edited By:

Aug 07, 2020 | 12:34 PM

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు ల‌క్ష‌ల‌కు పాజిటివ్ కేసులు చేరువ‌య్యాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి జైల్‌లో ఉన్న ఖైదీల‌ను సైతం వెంటాడుతోంది. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం..

రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం
Follow us on

ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండు ల‌క్ష‌ల‌కు పాజిటివ్ కేసులు చేరువ‌య్యాయి. ఇక ఈ మ‌హ‌మ్మారి జైల్‌లో ఉన్న ఖైదీల‌ను సైతం వెంటాడుతోంది. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం సృష్టించింది. 983 మందికి కోవిడ్ టెస్టులు చేయగా 254 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే సెంట్రల్ జైలులో ఉన్న 12 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకింది. సెంట్రల్ జైలులో మొత్తం 1666 మంది ఖైదీలు ఉన్నారు. కాగా కరోనా సోకిన ఖైదీలకు జైలులో ఉన్న న్యూ సీపీ బ్లాక్‌లో ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఇంకా 300 మంది ఖైదీల పరీక్షల రిపోర్ట్స్‌ రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైలులో మూలాఖత్ నిలిపివేశారు అధికారులు. ఇక‌ జైళ్లో అడ్మినిస్ట్రేష‌న్‌, డాక్టర్ ద్వారా కరోనా సోకినట్టు స‌మాచారం.

కాగా ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 10,328 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,96,789కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 72 మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,753కు చేరింది. గడిచిన 24 గంటల్లో 8,516 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,09,975కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,99,332 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 82,166 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

అర‌కులో నేటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రరావు స‌తీమ‌ణి మృతి

కొత్తగా 13 మంది స‌బ్ క‌లెక్ట‌ర్‌ల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం