AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతోంది. ఫలితంగా రోజు వారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 88,441 మంది శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. 10,373 మంది పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో కొందరు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా.. సీరియస్‌గా ఉన్నవారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, గత 24 గంటల్లో 15,958 మంది కోవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు భారీగా నమోదు అవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో ఒక్క రోజులోనే 80 ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. రికవరీలు పెరుగుతున్నా.. భారీ స్థాయిలో మరణాలు సంభవించడం కలవరానికి గురి చేస్తోంది.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 1,28,108 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 17,49,363 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 16,09,879 మంది కోలుకున్నారు. అయితే, కరోనా సోకడం వల్ల 11,376 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక తాజాగా రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం – 1002, చిత్తూరు – 1728, పశ్చిమ గోదావరి – 1880, గుంటూరు – 691, కడప – 475, కృష్ణా – 511, కర్నూలు – 505, నెల్లూరు – 459, ప్రకాశం – 659, శ్రీకాకుళం – 383, విశాఖపట్నం – 693, విజయనగరం – 309, పశ్చిమ గోదావరి – 1078 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.
Also read: