Corona Cases: సెప్టెంబర్ నాటి రికార్డు ఏప్రిల్ బద్దలు..? కరోనా సెకెండ్ వేవ్ ఉధృతే ఉధృతి

|

Apr 14, 2021 | 6:38 PM

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ పాత రికార్డులను బద్దలు కొట్టే దిశగా కొనసాగుతోంది. దేశంలో జన సాంద్రత అధికంగా వుండడం మూలాన కరోనాకు లక్కు చిక్కినట్లయింది. ప్రస్తుతం రోజువారీగా...

Corona Cases: సెప్టెంబర్ నాటి రికార్డు ఏప్రిల్ బద్దలు..? కరోనా సెకెండ్ వేవ్ ఉధృతే ఉధృతి
Corona April Month
Follow us on

Corona Cases Alert for India: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ (CORONA SECOND WAVE) పాత రికార్డులను బద్దలు కొట్టే దిశగా కొనసాగుతోంది. దేశంలో జన సాంద్రత (POPULATION DENSITY) అధికంగా వుండడం మూలాన కరోనా (CORONA)కు లక్కు చిక్కినట్లయింది. ప్రస్తుతం రోజువారీగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల (CORONA POSITIVE CASES) సంఖ్యను పరిశీలిస్తే దేశంలో కరోనా ఉధృతి కొనసాగిన సెప్టెంబర్ (SEPTEMBER) నెల నాటి రికార్డును బద్దలు కొట్టే సంకేతాలు చాలా బలంగా కనిపిస్తోంది. దాదాపు ఏడాదిన్నర క్రితం దేశంలో కరోనా ప్రవేశించినా.. ఆ తర్వాత రెండు నెలలకు గానీ తన ఉధృతాన్ని ప్రదర్శించలేదు. 2020 జనవరి (JANUARY 2020) 31న దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో తన ఉధృతిని మొదలు పెట్టింది. సెప్టెంబర్ నాటికి కరోనా కేసుల సంఖ్య పీక్ లెవెల్‌కు చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా కరోనా ప్రభావం తగ్గుతూ వచ్చింది. తిరిగి 2021 ఫిబ్రవరి రెండో వారం నుంచి దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమై ప్రస్తుతం పీక్ లెవెల్లో కేసులు నమోదవుతున్నాయి.

2020 జనవరి 31 దేశంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పుణె (PUNE)లోని వైరాలజీ ల్యాబు (VIROLOGY LAB)లో మాత్రమే కరోనాను గుర్తించే పరికరాలుండడంతో దేశంలో ఎక్కడ కరోనా పరీక్షలు (CORONA TESTS) నిర్వహించినా ఆ శాంపిళ్ళను పుణె పంపాల్సి వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 6, మార్చిలో 1244 కేసులు మన దేశంలో రికార్డయ్యాయి. కరోనా మరణాలు (CORONA DEATHS) కూడా మార్చి నెలలోనే ప్రారంభమయ్యాయి. మార్చి నెలలో 32 మంది కరోనాతో మరణానికి గురయ్యారు. మార్చి చివరి వారంలో దేశంలో లాక్‌డౌన్ మొదలైంది. ఏప్రిల్ నెల మొత్తం లాక్‌డౌన్‌ (LOCK DOWN)తోనే గడిచినా.. దేశవ్యాప్తంగా 31 వేల 799 కేసులు నమోదయ్యాయి. 1042 మంది మరణించారు. మే నెలలో కేసుల సంఖ్య లక్ష అంకెను దాటేసింది. మే నెలలో లక్షా 49 వేల 93 మందికి కరోనా సోకగా.. ఏకంగా నాలుగు వేల 90 మంది కరోనాతో మరణించారు. జూన్‌లో 3 లక్షల 84 వేల 697 మందికి కరోనా రాగా.. 11 వేల 729 మంది మరణించారు. జులైలో 10 లక్షల 72 వేల 30 మందికి కరోనా పాజిటివ్ రాగా.. 18 వేల 854 మంది మరణించారు. ఆగస్టు నెలలో మొత్తం 19 లక్షల 82 వేల 375 మందికి కరోనా సోకింది. 28 వేల 722 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

సెప్టెంబర్ నెల నాటికి దేశంలో కరోనా ఉధృతి పీక్‌లెవెల్‌కు చేరుకుంది. ఆ నెలలో ఏకంగా 26 లక్షల 4 వేల 518 మందికి కరోనా సోకింది. 33 వేల 28 మంది కరోనాతో చనిపోయారు. అక్టోబర్ నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆ నెలలో 19 లక్షల 11 వేల 356 మందికి కరోనా సోకింది. 24 వేల 144 మంది మరణించారు. ఆనాటి నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ రావడంతోపాటు దేశంలో కరోనా మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది. నవంబర్ నెలలో 12 లక్షల 94 వేల 572 కరోనా కేసులు, 15 వేల 498 మరణాలు రికార్డయ్యాయి. డిసెంబర్ నెలలో 8 లక్షల 34 వేల 983 కరోనా కేసులు, 11 వేల 599 మరణాలు నమోదయ్యాయి. జనవరి నెలలో 4 లక్షల 79 వేల 509 కొత్త కేసులు, 5 వేల 536 మరణాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలో కనిష్టంగా 3 లక్షల 50 వేల 548 కరోనా కేసులు, 2,777 మరణాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత 2021 మార్చి నుంచి దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ఉధృతమవడం మొదలయ్యింది.

April Corona Cases

మార్చిలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి 10 లక్షల మార్కును మరోసారి టచ్ చేసింది. మార్చి 2021లో 10 లక్షల 52 వేల 604 కరోనా పాజిటివ్ కేసులు నమోదై, 5 వేల 417 మరణాలు సంభవించాయి. ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు (ఏప్రిల్ 13వ తేదీ వరకు) దేశంలో 15 లక్షల 40 వేల 118 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 8 వేల 590 మంది గత పదమూడు రోజుల్లో మరణించారు. ప్రస్తుతం ప్రతీ రోజు దేశంలో లక్షన్నరకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ లెక్కన గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్‌లో పీక్ లెవెల్లో వున్న సెప్టెంబర్ నాటి మార్కు 26 లక్షలను ప్రస్తుత నెలలో దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సంఖ్యలో ప్రతీ రోజు కరోనా కేసులు నమోదైతే.. ఏప్రిల్ నెలాఖరుకు మరో పదిహేడు లక్షల కేసులు యాడ్ అయ్యి.. 32 లక్షలకు పైగా కరోనా కేసులు మన దేశంలో నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కోటి 36 లక్షల 89 వేల 453 మందికి కరోనా సోకింది. మొత్తం మరణాల సంఖ్య లక్షా 71 వేల 58గా నమోదైంది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ స్థాయిలో కరోనా బారిన పడిన దేశంగా భారత్ (BHARATH) మారే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.

వ్యాక్సినేషన్ వేగవంతం

దేశంలో జనవరి 16 తేదీన కరోనా వ్యాక్సినేషన్ (CORONA VACCINATION) మొదలైంది. జనవరిలో కేవలం ఫ్రంట్‌లైన్ వర్కర్ల (CORONA FRONTLINE WORKERS)కే వ్యాక్సిన్ ఇవ్వడంతో కేవలం 37 లక్షల 58 వేల 843 మందికి వ్యాక్సిన్ వేయగలిగారు. ఫిబ్రవరిలో కోటి 5 లక్షల 42 వేల 428 మందికి, మార్చిలో 5 కోట్ల 8 లక్షల 16 వేల 630 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఏప్రిల్ నెలలో 13వ తేదీ నాటికి 4 కోట్ల 60 లక్షల 61 వేల 682 మందికి వ్యాక్సినేషన్ నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశ జనాభాలో 11 కోట్ల 11 లక్షల 79 వేల 578 మందికి వ్యాక్సిన్ చేరింది. వ్యాక్సినేషన్ వేగవంతానికి కేంద్రం పక్కా చర్యలను చేపడుతోంది. అయితే.. ఈ ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం వుండడంతో అప్పటి దాకా మాస్కు (MASKS)లను ధరించడం, శానిటైజర్లు (SANITIZERS) వాడడంతోపాటు సామాజిక దూరాన్ని (SOCIAL DISTANCE) తప్పక పాటించాల్సిన పరిస్థితి వుంది.

ALSO READ: వ్యాక్సినేషన్‌తోనే కరోనాకు చెక్.. ఆ దేశాల విజయ రహస్యమిదే!

ALSO READ: దేశంలో పలువురు ముఖ్యమంత్రులకు కరోనా.. ఎవరెవరికి ఎప్పుడంటే?

ALSO READ: ఏపీ పాలిటిక్స్‌లో సవాళ్ళ పర్వం.. సై అంటే సై అంటున్న వైసీపీ, టీడీపీ