తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా..

| Edited By:

Jun 01, 2020 | 12:06 PM

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో ఆదివారం 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఒక్క‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే  ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్...

తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా..
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో ఆదివారం 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఒక్క‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే  ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం క‌ల‌క‌లం రేపుతుంది. ఇక‌ రంగారెడ్డిలో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున కోవిడ్-19 కేసులు నమోదు కాగా వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ముగ్గురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 2,698 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1428 మంది వ్యాధి న‌య‌మై వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 82కి చేరింది.

ఇక ఏపీ విషయానికొస్తే.. ఏపీలో ఆదివారం 98 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3042కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 9504 మంది నుంచి నమూనాలను సేకరించింది ఏపీ ప్రభుత్వం. 2092 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 792 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 70 కేసుల్లో 3 కోయంబేడు కాంటాక్ట్ కేసులున్నాయి.

ఇది కూడా చదవండి:

దేశవ్యాప్తంగా ప్రారంభమైన రైళ్లు.. 4 నెలలకు రిజర్వేషన్..

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

‘ఆ బడా డైరెక్టర్ బాగోతం బయటపెడతా’.. బిగ్‌బాస్ నందినీ సంచలన కామెంట్స్