కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా తాజాగా మరో మాజీ ఎంపీ మృతి చెందారు. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడి ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఘజియాబాద్ మాజీ ఎంపీ సురేంద్ర ప్రకాష్ గోయల్ మృతి చెందారు. రెండు, మూడు రోజుల క్రితం ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో వెంటనే ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో.. ఇవాళ ఉదయం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా మాజీ ఎంపీ గోయల్ మృతికి పలువురు కాంగ్రెస్ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read More:
ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం
ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా అలాగే ఉందిః ఆర్మీ ఆస్పత్రి వైద్యులు