కరోనాను దాచిపెట్టిన సింగర్ కనికా కపూర్ పై పోలీసు కేసు..

గాయని కనికా కపూర్ పై లక్నో పోలీసులు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 188, 269, 270 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెకు మార్చి 14 న లక్నో విమానాశ్రయంలో కరోనా టెస్ట్ చేసిన విషయం గమనార్హం.

కరోనాను దాచిపెట్టిన సింగర్ కనికా కపూర్ పై పోలీసు కేసు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 21, 2020 | 11:28 AM

గాయని కనికా కపూర్ పై లక్నో పోలీసులు భారత శిక్షా స్మృతి (ఐపీసీ) లోని 188, 269, 270 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెకు మార్చి 14 న లక్నో విమానాశ్రయంలో కరోనా టెస్ట్ చేసిన విషయం గమనార్హం. ఆ రోజున ఆమెకు విపరీతమైన జ్వరం ఉన్నట్టు కనుగొన్నారు.  కానీ ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టి కావాలని నిర్లక్ష్యం చేసినందుకు నిందితురాలిగా పోలీసులు తమ ఎఫ్ఐ ఆర్ లో పేర్కొన్నారు. లక్నో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇఛ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని ఆమెపై ఈ కేసు పెట్టారు. ఆమె లక్నో నగరంలో ఇఛ్చిన విందుకు అనేకమంది ప్రముఖ రాజకీయ నేతలు, ఎంపీలు, సెలబ్రిటీలు హాజరు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆమెను గత మార్చి 14 వ తేదీనాడే క్వారంటైన్ కి తరలవలసిందిగా అధికారులు సలహా ఇఛ్చినప్పటికీ కనికా కపూర్ దాన్ని పాటించలేదని వెల్లడైంది. తాను మార్చి 11 నే లక్నో వచ్చానని, అంతకుముందు తొమ్మిదో తేదీన లండన్ నుంచి ముంబై ఎయిర్ పోర్టు చేరుకున్నానని ఆమె వెల్లడించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. లక్నోలోని ఓ ఆసుపత్రిలో తను చేరానని., విమానాశ్రయాల్లో తనకు స్క్రీనింగ్ టెస్టులు జరిగినా ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తలేదని కనికా కపూర్  తెలిపింది. అసలు తనకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలియనే తెలియదని పేర్కొంది.

కనికా కపూర్ పై ఎఫ్ఐఆర్ దాఖలు కావడానికి కొన్ని గంటలముందు యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. లక్నో లోని విమానాశ్రయంలో కొన్ని వైఫల్యాలు ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. ఈయన కూడా కనికా ఇఛ్చిన విందుకు హాజరయ్యారు. ఎందుకైనా మంచిదని తాను సైతం సెల్ఫ్ ఐసొలేషన్ పాటిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా-కనికా కపూర్ లక్నో నగరంలో ఎంటరయినప్పటినుంచి గత వారం రోజుల్లో ఆమె ఎవరెవరిని కలుసుకున్నారో.. ఇందుకు సంబంధించిన సోషల్ గేదరింగ్స్ పై ఎంక్వయిరీ జరపాలని యూపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో