హృదయ విదారక ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు…

ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన యావత్ భారతదేశాన్ని కలిచి వేసింది. ఎండల తీవ్రతకు తల్లి చనిపోయిందని కూడా తెలుసుకోలేని రెండేళ్ల పిల్లాడు ఆమె శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ఇక ఈ ఘటనపై మహమ్మూద్ అనే లాయర్ బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ రైల్వే స్టేషన్‌లో సరైన ఆహారం, వసతి లేకే చనిపోయిందని.. దీనికి బీహార్ ప్రభుత్వం, రైల్వే […]

హృదయ విదారక ఘటన.. ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు...

Updated on: May 29, 2020 | 8:35 AM

ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన యావత్ భారతదేశాన్ని కలిచి వేసింది. ఎండల తీవ్రతకు తల్లి చనిపోయిందని కూడా తెలుసుకోలేని రెండేళ్ల పిల్లాడు ఆమె శవం పక్కనే కూర్చొని ఆడుకున్న ఘటన అందరిని కంటతడి పెట్టించింది. ఇక ఈ ఘటనపై మహమ్మూద్ అనే లాయర్ బీహార్‌ ప్రభుత్వం, రైల్వే శాఖపై ఎన్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. సదరు మహిళ రైల్వే స్టేషన్‌లో సరైన ఆహారం, వసతి లేకే చనిపోయిందని.. దీనికి బీహార్ ప్రభుత్వం, రైల్వే శాఖల వైఫల్యమే కారణమని ఆయన పేర్కొన్నారు.

మే 25న రికార్డు అయిన సీసీ టీవీ ఫుటేజ్‌ను సీజ్ చేసి.. బీహార్ ప్రభుత్వం, రైల్వేశాఖలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలకు కనీస సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని.. రైల్వేశాఖ వలస కార్మికులకు రైళ్లలో సరైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని మహమ్మూద్ ఎన్‌హెచ్‌ఆర్‌సీ తెలిపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగత గౌరవంతో జీవించే హక్కు ఉందని.. అంతేకాక వారికి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సదరు మహిళ కుటుంబానికి తక్షణమే నష్ట పరిహారాన్ని చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఎన్‌ఆర్‌సీని కోరారు.

Read This: లాక్ తీద్దామా.? వద్దా.? సీఎంలకు అమిత్ షా ఫోన్..