సీఎం జగన్ మ‌రో సంచలన నిర్ణయం..వైద్య సేవ‌లు మ‌రింత విస్తృతం !

|

May 13, 2020 | 4:22 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణా చర్యలపై సీఎం జ‌గ‌న్‌ సమీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశం ద్వారా

సీఎం జగన్ మ‌రో సంచలన నిర్ణయం..వైద్య సేవ‌లు మ‌రింత విస్తృతం !
Follow us on

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని వైద్య సేవ‌లు అందుబాటులోకి తెచ్చేలా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్ తాజాగా అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు వినియోగించే 108స‌ర్వీస్ వాహ‌నాల‌ను మ‌రింత పెంచారు.

రాష్ట్రంలో కరోనా వైరస్  నివారణా చర్యలపై సీఎం జ‌గ‌న్‌ సమీక్షా స‌మావేశం నిర్వహించారు. ఈ స‌మావేశం ద్వారా అధికారుల నుంచి రాష్ట్రంలో పూర్తి స‌మాచారంపై చ‌ర్చించారు. అనంత‌రం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ..108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అలాగే టెలి మెడిసిన్‌ కోసం కొత్త బైకులను కూడా కొనుగోలు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ఇది వైసీపీ ప్రభుత్వం కొత్తగా పెట్టిన కార్యక్రమమని, దీని అమలులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. ప్రతి మూడు వారాలకు బిల్లులు అప్‌లోడ్‌ కావాలని, ఆ తర్వాత వాటిని వెంటనే మంజూరు చేయాలని సూచించారు.