పుట్టగొడుగులతో కరోనా ఖతం.. సీసీఎంబీ కీలక పరిశోధన.!

|

Oct 23, 2020 | 6:36 PM

ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయి.

పుట్టగొడుగులతో కరోనా ఖతం.. సీసీఎంబీ కీలక పరిశోధన.!
Follow us on

Mushroom-Based Nutraceutical: ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్-హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(ఏఐసీ-సీసీఎంబీ) కీలక విషయాలను బయటపెట్టాయి. తాజాగా ఈ సంస్థలు సంయుక్తంగా పుట్టగొడుగులపై చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే కోవిడ్ 19కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచడానికి న్యూట్రాస్యూటికల్ ‘కరోన్ ఎయిడ్’ అనే మందును అభివృద్ధి చేశాయి.

పుట్టగొడుగులతో చేసిన ఆహార సప్లిమెంట్‌తో కరోనాకు చెక్ పెట్టగలదని.. రోగనిరోధక శక్తిని పెంచి యాంటీ ఆక్సిడెంట్లను పెంపొందిస్తుందని పరిశోధనలో తేలింది. ఏఐసీ-సీసీఎంబీ సంస్థలు పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన అంబ్రోసియా ఫుడ్ కంపెనీతో కలిసి ప్రయోగాలు చేపట్టింది. డిసెంబర్ నాటికి ఈ ‘కరోనా ఎయిడ్’ను అందుబాటులోకి తీసుకొస్తామని సీసీఎంబీ తెలిపింది. హిమాలయాల్లో దొరికే కార్డిసెప్స్ మిలిటారిస్ అనే పుట్టగొడుగుల నుంచి దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పసుపులోని కర్కుమిన్‌తో పాటు పుట్టగొడుగు పౌడర్‌ సమ్మేళనంతో ఈ కరోనా ఎయిడ్ యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పని చేస్తుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం క్లోన్ డీల్స్ క్లినికల్ ట్రయిల్స్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటికే ఎఫ్ఎస్ఎస్ఏ నుంచి మార్కెటింగ్ అనుమతులను తీసుకుంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్‌తో కలిసి నాగ్‌పూర్‌, నావీ ముంబై, భోపాల్ ప్రాంతాల్లో క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించనుంది.