Breaking: 10, 12వ తరగతి పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

కరోనా వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాష్ట్ర బోర్డు పరీక్షలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను లాక్ డౌన్ సమయంలో నిర్వహించుకోవచ్చునని కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఎస్ఈ నుంచి పలు అభ్యర్ధనలు రావడంతో వాటిని పరిగణనలోకి తీసుకుని.. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాలుగోదశ లాక్ డౌన్‌లో 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ నుంచి […]

Breaking: 10, 12వ తరగతి పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

Updated on: May 20, 2020 | 4:51 PM

కరోనా వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాష్ట్ర బోర్డు పరీక్షలు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలను లాక్ డౌన్ సమయంలో నిర్వహించుకోవచ్చునని కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఎస్ఈ నుంచి పలు అభ్యర్ధనలు రావడంతో వాటిని పరిగణనలోకి తీసుకుని.. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాలుగోదశ లాక్ డౌన్‌లో 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు స్కూళ్లు, కాలేజీలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్నట్లు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా లేఖ రాశారు. అయితే పరీక్షలు ఈ కండిషన్స్‌కు లోబడి నిర్వహించాలని ఆ లెటర్‌లో పేర్కొన్నారు.

  • కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి పరీక్షలూ నిర్వహించకోడదు.
  • టీచర్లు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
  • ప్రతీ ఎగ్జామ్ సెంటర్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. భౌతిక దూరం తప్పనిసరి.
  • విద్యార్ధులకు ఇబ్బంది లేకుండా అన్ని బోర్డులు పరీక్షల తేదీలను ప్రకటించాలి
  • విద్యార్ధులను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్పెషల్ బస్సులను వినియోగించవచ్చు.
Loading...
Unable to load recommendations.
Follow Us