
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో దాదాపు అన్నిరంగాలు దెబ్బతింటున్నాయి.
ఈ క్రమంలో కరోనా నివారణ చేసే పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్ బర్గ్ దంపతులు ముందుకు వచ్చారు. వైరస్ నివారణ కోసం చేసే ప్రయోగాల కోసం.. 25మిలియన్ డాలర్లు(రూ. 187కోట్లు) విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు బిల్ అండ్ మిళింద గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే 125మిలియన్ డాలర్లతో మిళింద గేట్స్ ఫౌండేషన్.. కరోనా నివారణ కోసం కార్యాచరణ చేపట్టింది.
NEW: Mark Zuckerberg and Priscilla Chan’s foundation @ChanZuckerberg is partnering with @gatesfoundation and will donate $25 million to help combat the #coronavirus.@GayleKing spoke exclusively with Mark and Priscilla about the effort. pic.twitter.com/AqiyhqhzaA
— CBS This Morning (@CBSThisMorning) March 27, 2020